పొరపాటున షాలిని మణికట్టుపై కోసిన అజిత్.. ఆ తర్వాత మొదలైంది లవ్ స్టోరీ!
on Nov 17, 2021
అది 1999వ సంవత్సరం.. 'అమర్కలమ్' సినిమా సెట్స్.. హీరోయిన్ చేతిని హీరో చాకుతో గాయపరుస్తున్నట్లు నటించాల్సిన సన్నివేశం. ఆ హీరో అజిత్.. ఆ హీరోయిన్ షాలిని. ఆ సీన్‌ను డైరెక్టర్ ప్లాన్ చేశాడు. కానీ షాలిని గాయం ప్లాన్ చేసింది కాదు. అజిత్ కేవలం గాయపరుస్తున్నట్లు నటించాలి. కానీ పొరపాటున, ఆమె మణికట్టు కోసుకుని, రక్తం చిందింది. ఆ దురదృష్టకర పొరపాటు రెండు భిన్న ధ్రువాలను కలిపింది. షాలినికి గాయమై బ్లీడింగ్ కావడంతో బాగా ఆందోళన చెందాడు అజిత్. కానీ షాలిని ఆ గాయాన్ని పట్టించుకోలేదు. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయనే సూత్రం ఆ ఇద్దరిపై పనిచేసింది. తన కోసం అజిత్ ఆందోళనపడటం షాలినిని కదిలించి, అతడివైపు ఆకర్షితురాలయ్యేట్లు చేసింది. మరోవైపు, తనకేమీ కానట్లు ప్రశాంతంగా కనిపించిన షాలిని చూసి ఆశ్చర్యపోయి, అప్పట్నుంచీ ఆమెను భిన్నంగా చూడసాగాడు అజిత్. అలా.. తమిళ చిత్రసీమలోని ఫేవరేట్ లవ్ స్టోరీస్‌లో ఒకటి మొదలైంది.
అజిత్, షాలిని తొలిసారి కలుసుకున్న సందర్భం అది కాదు. గ్రేడ్ 2 ఎగ్జామ్స్ కోసం షాలిని ప్రిపేరవుతున్నప్పుడు 'అమర్కలమ్' మూవీ కోసం నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అప్పటికే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన 'కాదలుక్కు మరియాదై' హిట్టయింది. ఆ సినిమాలో నటించాక, చదువుపై శ్రద్ధ పెట్టాలనుకుంది షాలిని. కానీ డైరెక్టర్ శరణ్ 'అమర్కలమ్'లో అజిత్, షాలిని జంటగా నటించాలని కోరుకున్నాడు. అందుకే ఆమె నిర్ణయం తెలుసుకోవడం కోసం ఫోన్ చేశాడు అజిత్. చదువుకు ఆటంకం కలగడానికి ఇష్టపడని షాలిని ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆమె ప్రాధాన్యతను గుర్తించిన అజిత్, శరణ్ ఎగ్జామ్స్ అయ్యాకే షూటింగ్ పెట్టుకుంటామని చెప్పారు.
ఇంతలో అజిత్ 'కాదల్ మన్నన్' (1998) సినిమా విడుదలై, దాని ప్రీమియర్‌కు రావాల్సిందిగా షాలినికి ఆహ్వానం వచ్చింది. ఆ ప్రీమియర్ దగ్గర అజిత్‌ను తొలిసారి కలుసుకున్న వైనాన్ని ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది షాలిని. "నేనప్పుడు జుట్టును ఉంగరాలుగా చేసుకున్నాను. నాతో కరచాలనం చేసి, నాకు ఆ ఉంగరాల జుట్టు నప్పలేదని చెప్పాడు. నాకు చిరాకు అనిపించింది. నా ముఖంవంక చూసి, 'ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. కాదలక్కు మరియాదై మూవీలో నీ జుట్టు స్వేచ్ఛగా ఎగిరిన తీరు చాలా బాగుంది' అని చెప్పాడు. అతని మాటల్లోని నిజాయితీ నాకు నచ్చింది" అని చెప్పింది షాలిని.
'అమర్కలమ్' సెట్స్‌పై జరిగిన ఘటన తర్వాత, కొద్ది కాలానికే తన జీవిత భాగస్వామి షాలిని అని ఫిక్సయిపోయాడు అజిత్. ఆ టైమ్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, షాలిని తన సముద్రమని చెప్పాడు. "నేను నది లాంటి వాడిని. నా జీవితం చాలా మలుపులు తిరిగింది. అనేక రాళ్లను ఢీకొట్టింది. నా భుజాల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. నాకోసం ఇప్పుడు సముద్రాన్ని కనిపెట్టాను. ఆ సముద్రం నాకు ప్రశాంతతను ఇచ్చి, నాకు స్ఫూర్తినివ్వడంలో తోడ్పడుతుందని నమ్ముతున్నాను." అని చెప్పాడు అజిత్.
షాలిని కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఆ ఇద్దరూ జీవిత భాగస్వాములయ్యారు. బాలనటిగా పాపులారిటీ తెచ్చుకొని, హీరోయిన్గా సక్సెస్ అయిన షాలిని పెళ్లి తర్వాత సినిమాల్లో ఇక నటించకూడదని నిర్ణయించుకుంది. షనేను నటనను ఎంజాయ్ చేశాను. కానీ అజిత్ మరింత టెప్టింగ్‌గా ఉన్నాడు. నటనను వదిలేయడానికి నాకెలాంటి సంకోచాలు లేవు. ఒకవైపు ఇంటినీ, ఇంకోవైపు కెరీర్‌ను మేనేజ్ చేసుకోగల రకం మనిషిని కాదు నేను. ప్రయారిటీస్ విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నా, ఇది చాలా హాయిగా ఉంది.ష అని 2009లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది షాలిని. ఎవరైనా స్క్రీన్ మీద మిమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పినప్పుడు ఆమెకు బాగా అనిపిస్తుంటుంది. షనేను సరైన పనే చేశానని అనుకుంటున్నా, లేదంటే ఇలా ఉండేదాన్ని కాదు. ఇది నాకెంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందిష అంటోందామె.
ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. అనౌష్క, ఆధిక్. వారితో షాలిని-అజిత్ మ్యారీడ్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా సాగిపోతోంది.
Also Read